జాతీయ గీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది కరీంనగర్ కు చెందిన అర్చన పండుగ. ప్రైవేట్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించాలనే కోరిక తో జాతీయ గీతం లో ఉన్న ఐదు చరణాలు 5.20 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేసింది. దీన్ని 75 సార్లు పాడేందుకు ఏడుగంటలు లండన్ లోని గిన్నిస్ బుక్ సంస్థ కు 40 వినతులు పంపి తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమం జరిపించాలని కోరింది జూలై 16వ తేదీన కరీంనగర్ లో ఆజాద్  అమృతోత్సవాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఏకబిగిన ఏడు గంటల పాటు జాతీయ గీతాన్ని ఆలపించింది అర్చన పండుగ.

Leave a comment