ఒక్కోసారి మనస్సుకి ఎంతో కష్టం ,సమస్య మరల కుండా వేధిస్తూ ఉంటుంది. దీన్నీ ఎవరితోనైనా పంచుకొంటే ఉపశమనంగానే ఉంటుంది. కానీ ఇలాంటి బలహీనమైన క్షణాలు మరింత ప్రమాదకరం అంటున్నాయి తాజా ఆధ్యయనాలు.మన సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తారు అనుకోనే వారితోనే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి కానీ వినేవారు దొరికారు కదా అని ప్రతి వాళ్ళతో చెప్పుకుంటూపోతే వారి అనవసరమైన వ్యాఖ్యానాలు మరింతగా ఆందోళనను పెంచుతాయంటున్నారు .ఊరికే ఊసుపోని కబుర్లు విన్నట్లు వినేసి మాట్లాడే వారి వల్ల నష్టమే అంటున్నాయి అధ్యయనాలు. విజ్ఞత గల వాళ్ళు, మన మేలుకోరుకొనే వాళ్ళతోనే మనసు విప్పి చెప్పుకోండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.

Leave a comment