ఎండలకు భయపడి పాపాయి లను కూడా ఎ.సి లో పడుకో పెడదాం అనుకుంటారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొత్త సమస్యలు వస్తాయి. పిల్లలు గది లో ఉన్నప్పుడే ఏసీ వేయకూడదు ముందే ఎ.సి వేసి వాతావరణం చల్లబడ్డాక పిల్లల్ని గదిలోకి తీసుకు పోవాలి ఉష్ణోగ్రత 27 డిగ్రీల కంటే తగ్గకుండా ఉండాలి. గది చల్లబడ్డాక ఎ.సి ఆపేయాలి ఎ.సి గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది ఎక్కువగా మాయిశ్చరైజర్ రాయాలి చేతులు కాళ్ళు కప్పే దుస్తులు వేయాలి ఇవి చలి నుంచి కాపాడతాయి టోపీ కూడా పెట్టాలి ఎ.సి లో దుమ్ము చేరకుండా సర్వీస్ చేయించాలి. దుమ్ము వల్ల ఆస్తమా అలర్జీలు వస్తాయి. ఒకేసారి చల్లని వాతావరణంలో నుంచి వేడిగా ఉన్న గదిలోకి తీసుకు పోకూడదు.

Leave a comment