ఇండియాలో అమ్మలు,తమ కూతుళ్ళకి అన్ని పనులు చేసి పెడుతూ చెడగొట్టేస్తారాని పిస్తుంది నాకు అంటోంది దిశా పటాని . నేను లక్నో ఇంజనీరింగ్ చేస్తున్నపుడు మోడ లింగ్ ఆఫర్లు వచ్చాయి. ఈ కొత్త కెరీర్ కోసం ముంబయ్ వెళ్ళి విదేశీ మోడ్ ళ్ళ తో కలపి పనిచేస్తున్నప్పుడు నేనెన్నో నేర్చుకొన్నాను. వాళ్ళంతా పూర్తి స్వతంత్రంగా ఉంటారు . ఎవరి పన్లు వాళ్ళు చేసుకుంటారు. అన్ని పనులు వాళ్ళకి వచ్చు .అలాగే నేనూ నేర్చుకొన్నాను. బద్దకంగా ఉండగూడదు అంటారు మా నాన్నగారు కూడా. బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకొన్న దిశ సామజిక మాధ్యమాల్లో టాప్ రేటింగ్ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అబిమానుల సంఖ్య 26. 2 మిలియన్లు ట్విటర్ లో 3. 61 మిలియన్లు ఫేస్ బుక్ 2. 5 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

Leave a comment