Categories
చీరె అందం అంత బ్లావుజ్ లోనే కనిపిస్తుంది . కొన్ని ప్రత్యేకమైన బ్లౌజ్ అతి మాములు చీరె ను కూడా అత్యంత ఖరీదైన డిజైనర్ చీరె కంటే అందంగా మార్చేస్తున్నాయి . ప్రత్యేకం త్రీడి ఎంబ్రాయిడరీ పూవులు,పక్షులు ఏ డిజైన్ ఐన సరే ఎంతో ప్రత్యేకం. అచ్ఛం పువ్వో ,పక్షి వాలినట్లు ఉంటుంది . అచ్చమైన సిల్క్ రిబ్బెన్ పూవు బ్లావుజ్ మెడచుట్టు పరుచుకొన్నట్లు ఉంటుంది . నిజమైన బటన్ గులాబీలు బ్లావుజ్ మొత్తం పరుచుకొంటాయి . త్రీడి ఎంబ్రాయిడరీ చిన్ని వేడుకలకు చాలా స్పెషల్ గా కనిపిస్తాయి . లెహంగాలు ,నెట్ చీరెలపైకి కూడా ఈ త్రీడి ఎంబ్రాయిడరీ ఎంతో బావుంటుంది . దాన్నే పఫ్ ఎంబ్రాయిడరీ అంటారు కూడా .