Categories

జయలలిత గారికీ నాకు ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి అంటోంది నిత్యామీనన్. దివంగత జయలలిత జీవిత కధ ఆధారంగా తీస్తున్న ది ఐరన్ లేడీ లో జయలలిత పాత్ర పోషిస్తుంది నిత్య. ఇద్దరం బెంగళూరు లో చదువుకున్నాం ,ఆమె అలవాట్లు,మాట తీరు,సమయపాలన,మేనరిజమ్స్ విషయాలలో అమ్మకు నాకు ఎన్నో పోలికలున్నాయి. ఈ విషయాన్ని దర్శకురాలు ప్రియదర్శిని ఎన్నో సార్లు అన్నారు. నేను పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయగలనని గట్టిగా నమ్మకంగా ఉంది అంటోంది నిత్యామీనన్ .