ఎసిడిటి నివారణకు గృహ వైద్యమే మేలు అంటారు ఎక్స్ పర్ట్స్. లవంగం నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ వుంటే విడుదల అయ్యే రసాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. పుదినా ఆకులు నీటిలో మారిగాకా కాచి చల్లా రాక తాగితే ఉదరంలో ఆమ్లాలు తగ్గి జీవనక్రియ మెరుగవుతుంది. చిన్న అల్లం ముక్క నమిలిన ఉపశమనం కలుగుతుంది. అల్లం బెల్లం నూరి ఆ మిశ్రమాన్ని చప్పరించిన అలాగే ఉపశమనం ఉంటుంది. బాగా పండిన అరటి పండు తినటం వల్ల మంచి ఫలితం వుంటుంది. చల్లని పాలలో అత్యధిక కాల్షియం వుండి కడుపులో ఆమ్లాలు ఏర్పడకుండా కాపాడతాయి. కడుపులో మంట తగ్గిస్తాయి. తులసి ఆకులు నమిలి రసం మింగితే మంచిది. నీళ్ళలో యాలకులు వేసి మరిగించి వడకట్టి తాగితే ఎసిడిటి నుంచి ఉపశమనం. జిలకర్రలో జీర్ణం చేసే శక్తి అధికం. జీలకర్ర నమిలి తిన్న జీలకర్ర నీటిలో వేసి మరగ నిచ్చి ఆ నీరు తాగిన మంచి ఫలితం కనిపిస్తుంది.
Categories