నేనెప్పుడూ రాజకీయాలకి దూరంగా లేను.నాన్నతో పాటు ఎన్నో దేశాలు తిరిగాను. నాన్న శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ గారు. నన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం ఆనందంగా ఉంది అన్నారు సురభి వాణి దేవి.హైదరాబాద్ పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ 21 వేల చెల్లని ఓట్లు పట్టభద్రులు వేయటం బాధనిపించింది అన్నారు. వాణి దేవి భర్త దయాకర్ రావు తో కలిసి ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు.