Categories
దేశ సమస్యల పైన ఆడ పిల్లలకు అవగాహన కలిగించేందుకు గాను 36 మంది బి.యస్.ఎఫ్ మహిళా జవాన్ల బృందం సీమ భవాని సౌర్య మహిళా సాధికార యాత్రను మొదలు పెట్టారు. ఢిల్లీ ఇండియా గేట్ నుంచి మొదలైన యాత్ర పూణే,అమృత్సర్, జైపూర్ మీదుగా హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు, కన్యాకుమారి మార్గాల ద్వారా మొత్తం 5280 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపి స్పష్టమైన లక్ష్యాలు ఎంచుకొనేలా చూడాలన్నదే మా యాత్ర లక్ష్యం. ఇరవై రోజుల పాటు రోజుకు 290 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేశాం. ఫిట్ నెస్ ఆహారం పై దృష్టి పెట్టాం అంటారు జవాన్, సోలో ట్రావెలర్ అయినా కంబన్ ఉగూర్ సంధి.