జు దైయా బాయ్ భైగా వయసు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వరకు ఆమె కుంచె పట్టుకోలేదు . ఈ పదేళ్ళ లో ఆమె అంతర్జాతీయ చిత్రకారిణి అయిపోయింది . ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి పారిస్ లోనూ ఇటలీ లోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోనూ ప్రఖ్యాత చిత్ర కారుల వరసలోను స్థానం సంపాదించారు . మధ్యప్రదేశ్ లోని లోరా అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది . బెంగాల్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆషిశ్ విద్యార్థి ఈ గిరిజన గ్రామాల సందర్శనకు వచ్చే ఉచితంగా అక్కడి వాళ్ళకు చిత్రలేఖనం నేర్పించారు . 70 ఏళ్ళ భైగా అప్పుడు కుంచె పట్టుకొంది . ఎంతోమంది కళాకారులకు సాధ్యం కానీ అడవి బిడ్డలకు మాత్రమే తెలిసిన మెళుకున్ భైగా కళ్ళలో ఉంది . ఆమె జంతువుల కళ్ళలోని భావాలు గ్రహించ గలదు ఆభావాన్ని తను గీస్తున్నా బొమ్మలోకి తేగలిగింది . అలా ఆ లోరా గ్రామాన్ని ప్రపంచ స్థాయి వేదిక పైన నిలబెట్టింది .
Categories