మహిళా విలువిద్యలో దీపికా కుమారి కి ఎదురు లేరు. జార్ఖండ్ కు చెందిన 26 సంవత్సరాల దీపికా కుమారి ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో ఎదిగింది . దీపికా తండ్రి శివనారాయణ్ మహాతో ఆటో డ్రైవర్ తల్లి గీత మహతో రాంచి మెడికల్ కాలేజీ లో నర్స్ గా పని చేస్తున్నారు . 2005 ఖార్సవన్ పట్టణం లోని అర్జున్ ఆర్చరీ  అకాడమీ లో ఆ తరువాత జెమ్ షడ్  పూర్ లోని టాటా ఆర్చరీ అకాడమీ లో దీపికా శిక్షణ తీసుకొంది . 12 సంవత్సరాల వయసులో అమెరికాలో ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పథకాన్ని గెలుచుకొన్నాక దీపికా వెనుతిరిగి చూడలేదు . టర్కీలో ని అంల్యుఖ్యలో జరిగిన ప్రపంచ కప్ లో దీపిక స్వర్ణ పతకం సాధించటం తో ప్రపంచ నంబర్ వన్ గా అవతరించింది .

Leave a comment