Categories
ప్రపంచంలో ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉందని ఒక అధ్యయనం చెపుతుంది.దేశంలో కోటీ 40లక్షల మంది పిల్లలు అధికబరువుతో ఉన్నారని అధ్యయనం పేర్కోన్నది.సాధారణంగా ఊబకాయంతో ఉన్న మహిళలకు పుట్టే బిడ్డకు అధిక బరువు సమస్య పదిరేట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే తండ్రి అధిక బరువుతో ఉంటే మగపిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఐదు రేట్లు అధికంగా ఉంటుందట. పిల్లల బరువును నియంత్రణలో ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్వీట్లు, పానీయాలు తగ్గించాలి. ఇంట్లో వండిన పదార్థాలే ఇవ్వాలి. సమతుల పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.చిన్న పిల్లల చేత 10 నిమిషాలు వ్యాయామం చేయించాలి.