Categories

మన దేశ మహిళల్లో 20.7 శాతం అధిక బరువుతో ఉన్నారని ఈ మధ్య జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లే ఈ ఊబకాయానికి కారణం అంటున్నారు అధ్యయనకారులు. తప్పనిసరిగా ప్రతిరోజు కాలినడకన వెళ్లడం అలవాటు చేసుకోవాలని నడక మంచి వ్యాయామ మనీ చెబుతున్నారు. నూనె లేని పదార్థాలు తినడం ముఖ్యంగా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యంగా తగినంత పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. జిమ్ లు వెయిట్ లాస్ సెంటర్ ల జోలికి పోరాదని నెమ్మదిగా ఆహారంలో మార్పులు వ్యాయామం తోనే శరీరం బరువును తగ్గించుకోవాలని చెబుతున్నారు అధ్యయనకారులు.