మన దేశంలో సాంస్కృతిక పునాదులు బలంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు . ఎన్ని హితోవాద ఉద్యమాలు నడిచినా ,ప్రజలు దైవచింతన,ఆధ్యాత్మిక మార్గాలు ఎంచుకోలేదు . ఆప్రాంతాన్ని పాలించిన రాజులు పోషించిన శిల్ప కళ ,చిత్ర కళ లు అనేకంగా ఉన్నాయి . అందులో తమిళనాడు ప్రత్యేకం తంజావూరు చిత్ర కళ చెక్క,వస్త్రం లో చేసే ఈ కళ 16 వ శతాబ్ధం నుంచి వుంది. పురాణం గాధలు ,పుణ్య పురుషుల చిత్రాలు ఇందులో భాగం. ముఖ్యంగా కృష్ణుడి చిత్రాలు అనేకం. చెక్క పలకలపైనా చేసే ప్యానల్ పెయింటింగ్స్ కళా ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తాయి చక్కని నేపధ్య చిత్రీకరణ,అందమైన కళ్ళలో బావ వ్యక్తీకరణయే చిత్రాల్లో బాగా కనిపిస్తాయి. గీసిన బొమ్మల పైన బంగారు జర్ ,ఇతర విలువైన రాళ్ళను పొదిగి ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. బంగారు ఆకులు ,రంగు గాజు ముక్కలు కూడా ఈ చిత్రాలపై అద్దుతారు.
Categories