Categories

మనసుకు తోచినట్లు ముక్కుసూటిగా మాట్లాడటం కంగనా రనౌత్ కే చెల్లుతుంది. దేశ సమస్యలపైన మీరు ఎందుకు స్పందిచరు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఒకళ్ళని వేలేత్తి చూపించకుండా సమస్యపై గళం విప్పటం ఒక పౌరుడిగా అది అందరి బాధ్యత . విజయాలతో దూసుకు పోయే మమ్మల్ని కెమెరాల్లో బంధించేందుకు క్లిక్కుల వర్షం కురుస్తుంది. అలాంటి తారలు దేశంలోని సామాజిక సమస్యలపై నోరు విప్పకపోతే వారు సాధిస్తున్నా విజయాలకు అర్ధం లేదు. స్టార్ డమ్ అనేది ప్రేక్షకులు ఇచ్చిందే. అలాంటి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడటం ఎంతైన అవసరం అన్నది కంగనా . ఈ దేశంలో పుట్టి ,ఈ దేశ ప్రజల వల్ల వచ్చిన స్టార్ డమ్ ను అనుభవిస్తూ సమస్యలు పట్టనట్లు ఉండటం ఏ స్టార్ కీ మంచిది కాదు అంటోంది కంగనా రనౌత్.