బైడెన్‌ అధికార యంత్రాంగంలో కీలకమైన పర్యావరణ విధాన సీనియర్‌ సలహాదారు పదవికి ఎంపికైన భారతీయ-అమెరికన్‌ సోనియా అగర్వాల్‌ కుటుంబానిది పంజాబ్‌ ప్రాంతం. అమెరికాలోని ఓహియో ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. రెండువందల మందికి పైగా విద్యుత్‌ విధాన నిపుణులు కలిసి పని చేస్తున్న ‘ఎనర్జీ ఇన్నోవేషన్‌’ సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలిగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రేటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Leave a comment