‘నేను పనిచేసే విద్య సంస్థ ఇంటినుంచి తెల్లవారు జామునే బయలుదేరి తిరిగి రాత్రే ఇంటికి చేరుకుంటాను . దిశ సంఘటన తర్వాత నాకు ఏదైనా ఆపద కలిగితే ఎవరోవచ్చి రక్షిస్తారనే నమ్మకం పోయింది . అందుకే నాకు గన్ లైసెన్స్ ‘ఇవ్వండి అని పోలీస్ కమిషన్ కార్యాలయం లో దరఖాస్తు చేసింది వరంగల్ కు చెందిన నౌషీన్ ఫాతిమా …. ముందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి కమిషనర్ ను కలుసుకొన్నా ,నా ధృవపత్రాలు సమర్పించాను పరిశీలన తర్వాత లైసెన్స్ ఇస్తారు . తర్వాత నేను తుపాకీ కొనుక్కొని శిక్షణ తీసుకొంటాను అంటోంది ఫాతిమా . మా ఇంట్లో వాళ్ళు ముందు వద్దన్నారు కానీ నా భయం అర్ధం చేసుకొని ప్రోత్సహించారు అంటోంది ఈ కంప్యూటర్ సైన్స్ అధ్యాపకరాలు ,వరంగల్ వాసి ఫాతిమా .

Leave a comment