గుజరాత్ కళాకారులు లక్కపనిలో ప్రసిద్ధులు . సంకెడాలో నివసించే ఖరాడీ సుతార్ జాతి వాళ్ళు నాజూకైన కళాఖండాలు తాయారు చేస్తారు . సంకేళాలో దొరికే కలపతో ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగులు వాడి వివిధ ఆకృతులు చేస్తారు . కలప పైన ప్రకృతి చిత్రాలు వెండి,బంగారు రంగుల్లో గీస్తారు . ఇలా గీసినవి పాడైపోకుండా వాటిపైన పొరగా లక్కను పూస్తారు . ఈ లక్క పూయటం వల్ల వాటికీ మెరుపు వస్తుంది . నవరాత్రుల్లో దాండియా ఆడే కర్రలను ఇక్కడే తయారు చేస్తారు . పొట్టి బల్లలు,అలంకరణ సామాగ్రి పెట్టుకొనే పెట్టెలు ఇవన్నిచేత్తోనే చేస్తారు . సంబేడలో చేతితో చిత్రించిన ఫర్నిచర్ చేసే సంప్రదాయం 1800 ల మధ్యకాలం నాటిది .

Leave a comment