నర్మదా నదీ పరివాహక ప్రాంతంలోని వింధ్య పర్వతాలలో ఎన్నో సుందర ప్రదేశాలున్నాయి . వింధ్య సాత్వారీ పర్వతాలలో సముద్రమట్టానికి 3750 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో పచ్చని అడవుల్లోంచి ప్రవహిస్తాయి ఈ నదులు . అక్కడి అందమైన ప్రదేశాల్లో అమరకాంత్ ఒకటి . ఇది ఒకనాటి అయోధ్య సామ్రాజ్యంలో భాగం ,పాండవుల తమ అత్యధిక సమయం ఇక్కడ గడిపి ఆధ్యాత్మిక శక్తి ని గావించిన ప్రదేశంగా దాన్ని చెపుతారు . ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి . ఇందులో యంత్ర మందిరం పై నున్న శిల్పాలు ఎంతో అద్భుతం . నాలుగు తలలు నాలుగు దిక్కులకు చూస్తూ వున్నట్లున్న ఈ పురుషరూపం శిఖరాగ్రంలో ఉంటుంది . కిందికి మెట్లలాగా ఉండే గోపురంలో ప్రతి మెట్టు పైన ఎంతో అందమైన చక్కని శిల్పాలు ఉంటాయి . టూరిస్ట్ లు అమితంగా ఇష్టపడిన ప్రదేశం ఇది .

Leave a comment