చిన్నప్పుడే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ రోజులు గుర్తొస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అనుభవం పెరుగుతున్న కొద్ది ఎలాంటి పాత్రలు వేస్తే బావుంటుంది తెలిసింది. వ్యక్తిగానూ ఎదిగాను కనుక ఇప్పుడు నేను ఆలోచించే విధానమే మారిపోయింది. అందుకే నేను కొత్తగా అనిపిస్తున్నా అంటుంది తమన్నా. అనుకోకుండా చిత్రపరిశ్రమలోకి రాలేదు తమన్న. టీవీలో మాధురీ దీక్షీత్ పేరు చూసి తాను అలాంటి డ్యాన్స్ లు చేసి ప్రేక్షకులను ముగ్దులను చేయాలనుకుంది.అన్నట్లుగానే డ్యాన్స్ తో పేరు తెచ్చుకుంది.ఎప్పటికైనా డ్యాన్స్ ప్రధానంగా ఉండే సినిమా చేయడం నా కల అని చెబుతుంది.

Leave a comment