Categories
డిజిటల్ అడిక్షన్ నుంచి బయటకు రావాలని చూస్తోంది యువతరం. గంటల తరబడి ఫోన్ కు బంది అవటం ఒక వ్యసనం అని అర్థం చేసుకొని దీనిలో నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతోంది. ప్రతి 20 నిమిషాలకు ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. ఫోన్ కాస్త దూరంగా ఉంచటం నిద్రపోయే ముందర స్క్రీన్ ఆఫ్ చేయటం అధిక సమయం ఫోన్ ఉపయోగించకుండా సెల్ఫ్ కంట్రోల్ లో ఉండటం ముందు ముఖ్యం. అలారం సెట్ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి మాత్రమే ఫోన్ చెక్ చేసుకోవాలి. ఫోన్ పక్కన పెట్టి పుస్తకం చదువుకోవటం స్నేహితులను ప్రత్యక్షంగా కలుసుకోవటం ముఖ్యం. సామాజిక మాధ్యమాలు చెడ్డవి కాదు, కానీ వాటిని పరిమితంగా ఉపయోగించకపోవటమే సమస్య అంటారు మానసిక నిపుణులు.