Categories
ప్రపంచంలో ఏ మూలకెళ్ళిన ఎవరితోనైనా మాట్లాడగలగే భాష నవ్వు. ఒక్క చిరునవ్వు ఎలాంటి వాళ్ళనైనా స్నేహితుల్ని చేస్తుంది. ప్రాచీన చైనీలు ఆత్మానందం అన్నదాన్ని ప్రత్యేకంగా బోధించేవాళ్ళట. తమలో తామే నవ్వుకోటం వల్ల ఆనందం, ఆరోగ్యం ఆయుష్షు పెరుగుతాయట. ఒక అధ్యయనం ప్రకారం 1950లో ప్రజలు రోజుకు 18నిమిషాలు నవ్వితే ప్రస్తుతం ఆ సమయం 4, 6 నిమిషాలకు పడిపోయింది. రోజుకు 15 సెకన్లు ఎక్కువ నవ్వితే ఇంకా రెండు రోజులు ఆయుష్షు పెరిగిందని అర్ధం చేసుకోవాలట. ఎక్కవ నవ్వే వాళ్ళలో యాంటీ బాడీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతోందట. నవ్వుతో శరీరంలోని కండరాలు సమన్వయంతో కదులుతాయట. దీంతో నోప్పులు తెలియవంటున్నారు. మొత్తానికి నవ్వయితే ఆరోగ్యం.