తారాగై ఆరాధన 9 నెలలు వయసులోనే స్వతంత్రంగా ఈదటం నేర్చుకుంది. తండ్రి అరవింద్ అరుణ్ శ్రీ స్క్రూ బా డ్రైవింగ్ ఎక్సపర్ట్ .ఆరాధన కు శిక్షణ ఇచ్చారు అలాగే మెరైన్ పొల్యూషన్ అరికట్టే దిశగా కూతురిని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆరాధన సముద్రజలాల ప్రక్షాళన తో పాటు సముద్ర జీవులకు కాలుష్యం తో కలిగే ప్రాణ హాని గురించి ప్రచారం చేస్తోంది. ఈ మధ్యకాలంలో సేవ్ ది ఓషన్ కార్యక్రమం లో భాగంగా ఏకబిగిన 18 కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో వేయవద్దని ప్రచారం చేస్తూ ఇప్పటికీ సముద్రం నుంచి 600 కిలోల చెత్త తొలగించింది. పర్యావరణ హితమైన ఈ బాధ్యతను చిన్నవయసులోనే భుజాలపైకి ఎత్తుకుంది ఆరాధన.

Leave a comment