Categories
నేను ఒడిపోకుండానే నా ఓటమి నిశ్చయం చేశారు నాకు ఎడమ కన్ను కనిపించదు కుడికన్ను అస్పష్టంగా ఉంటుంది. ఆ కాస్త చూపుతోనే చదరంగం ప్రాక్టీస్ చేశాను. ప్రత్యేక బోర్డు తయారు చేయించారు మా తల్లిదండ్రులు ప్రత్యర్థులతో ఆట సమయం ఎక్కువ అవుతుందని చిరాకు పడకుండా శరవేగంతో ఆడటం ప్రాక్టీస్ చేశాను. 2015 లో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అనిపించుకునే అంతవరకు విశ్రమించలేదు అంటోంది నటాషా మోరల్స్ టోర్నీ లో 478 మ్యాచ్ లు ఆడితే 222 మ్యాచ్ ల్లో గెలిచింది 108 మ్యాచ్ల్ ల్ని డ్రా గా ముగించింది. ఫ్యూర్టో రికో టాప్-2 క్రీడాకారిణిగా ఎదిగింది చదరంగం అంటే ఒక రకంగా రణ రంగం అంటుంది నటాషా.