నీహారికా, నువ్వు అడిగిన ప్రశ్న ఒక్కో సందర్భంలో అందరికీ అనిపిస్తుంది. కొందరినే అదృష్టం ఎందుకు వరిస్తుంది? అని కరక్టే అలాగే దీని పక్కనే ఇంకో ప్రశ్న పెట్టేద్దాం కొందరినే ఎందుకు కష్టాలు వరిస్తాయి? ఇప్పుడు విషయం సరిగ్గా అర్ధం అవుతుందనుకోంటాను. మహారాజైనా, సామాన్యుడైనా జీవితంలోని అనుభవాలు ఒక్కలాంటివే ఏ ఒక్క రోజు ఒకేలా గడిచిపోదు. చెడు అనుభవాలు లేని మనిషంటూ వుండదు. అలాగే అదృష్టం విషయంలోనూ ఎలాంటి లాజిక్ కుడా లేదు. వెళుతూ వెళుతూ జారిపడటం ఎలా ఆశ్చర్యమో ఇదీ అలాగే అనుకోవాలి. ఒక పోలికని, అదృష్టం మనకెందుకు లేదనే పోలికని మనస్సులోకి తెచ్చుకోవడమే మొదటి నష్టం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎదో ఒక బాధ మరణం వైపు నడిపించే అనారోగ్యం. సంసారంలో ఘర్షణ, మాట వినని పిల్లలు, ఆస్థి తగాదాలు, చదువులు, పెళ్ళిళ్ళు, ఉద్యోగం ఎదో ఒక్క సమస్య . కానీ అందరు ఎదో ఒక్క విధంగా ఆ బాధ లోనుంచి విముక్తి వైపు ప్రయాణం చేస్తారు. అయాచితంగా ఎదురయ్యే అదృష్టం గురించి ఆలోచిస్తే బాధ పడుతూ అక్కడే వుంటే జీవితంలో వచ్చే అవకాశాలు వెళ్ళిపోతాయి. నీ జీవితం గురించి నీవు ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, నీ జీవితం నుంచి ఇతరులు పాఠాలు నేర్చుకొనేంత బాగా దాన్ని తీర్చి దిద్దుకొమంటారు రచయిత. జీవితం అదృష్టం కంటే గొప్పది. ఎప్పుడో ఒక్కసారి మనల్ని వరించొచ్చు. అంచేత దాన్ని గురించి ఆలోచన పక్కన పెట్టి వాస్తవంలో మన జీవితాన్ని మలుపు తిప్పగల ఒక మంచి దిశా వైపు అడుగులు వేయడం సబబు.
Categories