Categories
ఏరోబిక్స్ వ్యాయామం చేస్తే జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అల్జీమర్స్ డిసీజ్ జర్నల్ ప్రచురితమైన ఈ అధ్యయనం లో ఏరోబిక్స్ లో పెరిగే రక్తప్రసారం వల్ల వయసు మీరిన వాళ్లలో మతిమరుపు సమస్యలు తగ్గుతాయి అంటున్నారు. 60 ఏళ్ల పైబడిన వారి పై చేసిన ఈ ప్రయోగాలు ఈ అంశాన్ని రుజువు చేశాయి.