చదువు పట్ల ప్రేమకు వయస్సుతో పనిలేదు.105 సంవత్సరాల కేరళ మహిళ భగీరథ అమ్మ 74.5 శాతం మార్కు లతో నాలుగో తరగతి పాస్ అయిపోయింది.కేరళ రాష్ట్ర అక్షరాస్యత యంత్రంగం అమ్మ ఉతీర్ణతను అధికారకంగా ప్రకటించింది.కొల్లం జిల్లా త్రిక్కరువ పంచాయతీ లోని ప్రక్కులం గ్రామంలో భగీరథ అమ్మ నివసిస్తోంది. మూడవతరగతి లోనే పెద్దల వత్తిడితో చదువు మానేసిన భగీరధమ్మ,పట్టుదలతో ఇప్పటికి చదువు మొదలు పెట్టి. నాలుగో తరగతి పాసై ఐదొవ తరగతిలో చేరనున్నది.

Leave a comment