మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై  చర్మం  ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా  సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల  చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ స్క్రీన్ రాత్రి వేళ  మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైవైపుకు మస్సాజ్ చేయాలి. దీని వల్ల  రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యి లైన్స్ మడతలు తగ్గి పోతాయి. ఆయిల్ మస్సాజ్ చేస్తే వార్ధక్య లక్షణాలు కనపడవు. రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి పసుపు నిమ్మ రసం పాల మీగడ కలిపి మెడకు అప్లయ్ చేసి కడిగేస్తే మృత కణాలు పోతాయి. నలుపు తగ్గిపోతుంది.ఓట్ మీల్ పెరుగు బాదం పొడి టొమాటో  రసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

Leave a comment