నిహారికా ,
మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు. ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం నిర్దాక్షణ్యంగా ఉంటే మన లోపం మనకి తెలుస్తుంది. ఈ విచక్షణ నిరంతరం కలిగివుంటే మనల్ని అనుక్షణం విమర్శిస్తోంది. కనక లోపం గుర్తించటం సులువవుతుంది. నిరంతరం మనల్ని మానిటర్ చేసి అంచనా వేసి జడ్జి చేసే మనసాక్షి మనల్ని ఇతరులతో పోల్చి చూస్తుంది. ముందుకు నెట్టి చూడమంటుంది. మహా బలాన్ని తగ్గించి కూడా లోపాల్ని మాగ్నిఫై చేసి గతంలో చేసిన పనుల పట్ల విచారాన్ని భవిష్యత్తు భయాన్ని పెంచుతుంది. ఇలా అని మనం ఆత్మవిశ్వాసాన్ని సృజననీ పోగొట్టుకొకూడదు. మనం ఎటు వైపు నడుస్తున్నామో మన ఆలోచనలు మనల్ని ఉత్తమమైన దిశగా నడిపిస్తున్నాయో లేదా మన లోపల నిద్రలేచిన లోపం అన్న శత్రువుని నిర్ములించామా లేదా అనే ప్రశ్నలు వేసుకుంటే చాలు. అద్దంలో కనబడే శారీరికంగా లోపాల్ని దిద్దుకున్నట్లే మనల్ని మనం సరిదిద్దుకోగలుగుతాం. నీ మనస్సుని తెరచి ఉంచుకో. విశ్లేషించుకో. నీ లోపాల్ని పోగొట్టుకో తల్లీ !