సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. స్టోరీ చాలా  బావుంది. తన రోల్ ఇంకా బావుండటంతో ఓకే చేసానని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడి చేసారు. చిరంజీవితో స్టాలిన్ మోహన్ బాబు తో యమ దొంగ చిత్రాల్లో నటించిన ఖుష్బూ శక్తిమంతమైన పాత్రలో మళ్ళీ సినిమాల్లోకి రానున్నది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాననీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాలో తనూ భాగంగా ఉండటం సంతోషంగా ఉందంటోంది ఖుష్బూ.

Leave a comment