40 రోజుల్లో 700 మైళ్ళ ప్రయాణించి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కింది 32 ఏళ్ల ప్రీత్ చాందీ. 2007 లో బ్రిటీష్ సైన్యంలో ప్రీత్ క్లినికల్ ట్రైనింగ్ అధికారిగా చేరింది. సాహసాలను ఇష్టపడే ప్రీత్ నవంబర్ 24న దక్షిణ ధృవ యాత్రకు బయలుదేరి 90 కేజీల బరువున్న సంచులను మోస్తూ మైనస్ 50 డిగ్రీల వాతావరణం లో అతి చల్లని ఈదురుగాలుల మధ్య ప్రయాణం కొనసాగించింది. సైనికుల ధృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ చాందీ అంటూ బ్రిటిష్ ఆర్మీ ఆమెకు అభినందనలు అందజేశారు.

Leave a comment