Categories
WoW

ఆహారాన్ని బట్టే చక్కని రూపం.

ఎంతో మందిని చూడగానే సరైన తీరులో వంపు సొంపుల శరీరంతో చూడగానే ఆకట్టుకునే రీతిలో, హుండానంతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలా వున్న వాళ్ళు జిమ్లో గంటల తరబడి సాధన చేసి తయ్యారైన శరీరాన్ని సాధిమ్చారనుకోంటే పొరపాటే. చక్కని రూపం ప్రాధమికంగా రూపం దిద్దుకునే వంట ఇంటిలో చేసే పదార్ధాల మీద మాత్రమే. ఆ తర్వాతనే ఏ జిమ్లో మెరుగులు పెట్టుకొన్నా సరైన ఆహారం అందకపోవతే శరీరానికి ఏమిచ్చినా రూపం రానే రాదు. తగినంత శక్తిని ఇచ్చే పోషక పదార్ధాలు కావాలి. కొత్త కనజాతాల ఏర్పాటు దెబ్బతిన్నా వాటి మరమ్మతు. కండరాళ్ళ ఎదుగుదల వంటివి సక్రమంగా ఉంటేనే శరీరానికి మంచి రూపం వుంటుంది. అది తగిన ఆహారం ద్వారానే సాధ్యం. సరైన ఆహార పద్దతుల ఎంపిక లేకపోతే ఊబకాయం, జీర్ణ వ్యవస్థ పనితీరు తో పాటు ధైరాయిడ్ గ్రంధి పని తీరు సమస్య ఏర్పడతాయి. ఫలితంగా శరీర రూపం చెదిరిపోతుంది. వాడే నూనె, తినవలసిన నిష్పత్తిలో కూరగాయలు, పండ్లు, ధన్యాలు, సరైన వేళకి సరైన రీతిలో వండిన భోజనం ఇవన్నీ అందమైన, ఆకర్షణీయమైన శరీర నిర్మాణానికి సాయం చేస్తాయి.

Leave a comment