షాపింగ్ లో కళ్ళకు ఎప్పుడూ ఆకర్షనీయంగా తోచేది ఎరుపు రంగే ఆ ఎరుపు తోనే చక్కని ఆకర్షణ వుంటుంది. ఎరుపు డ్రెస్ పైకి బ్రైట్ యాక్సిసరీలు బావుండవు. సింపుల్ గా స్టయిల్ గా వుండాలి. బ్లాక్ బాగ్ , అందమైన స్టిలెట్టొ పెయిర్ సరిపోతాయి. స్టిర్ బ్లాక్ టైట్స్ సిల్క్ లేదా స్కార్ఫులు కూడా బాగానే నప్పుతాయి. ఏదైనా పార్టీలు ప్రత్యేకంగా కావాలంటే ఈ ఎరుపే కళ్ళు కట్టేస్తూవుంటుంది. అలాగే కొంచం వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రింటెడ్  వస్త్రాలు బావుండవు అనుకుంటారు. ఇది అభిరుచులకి తగ కాలక్షన్. ధరించే సందర్భాన్ని బట్టే డ్రెస్. ప్రింట్స్ కి వయస్సుకి సంబంధం లేదు. ప్రింటెడ్, సాలిడ్ కలర్స్ మిక్స్ చేస్తే మరీ బావుంటాయి. ఉదాహరణకు ప్రింటెడ్ టాప్ కి, సాలిడ్ కలర్ బాటమ్, స్కర్ట్ లేదా ట్రౌజర్ ట్రై చేయాలి. అయితే రంగులు, ప్రింట్లు అలా వుంచి మనం వేసుకునే డ్రెస్ ఆ సందర్భానికి సరిగ్గా మ్యాచ్ అయ్యే లా మాత్రం చూసుకోవాలి.

Leave a comment