సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ  గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ  ఉంటుంది. కలబంద గుజ్జుతో అల్లల్లా తేలినట్లు ఉండాలనుకుంటే తల స్నానం చేసి జుట్టు ఆరాక కలబంద గుజ్జులు కాస్త  చుక్కల నిమ్మరసం కలిపి రాసుకుని పది నిమిషాలు  కడిగేసి చుస్తే  జుట్టు ఎంత అందంగా కనిపిస్తుంది. జుట్టుకు జీవం వస్తుంది. అరకప్పు కలబంద గుజ్జు రెండు మూడు చుక్కల కొబ్బరినూనె నీళ్లు కలిపి తలంతా రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే కలబంద జుట్టుకు తేమ అందించి తాజాగా పట్టులా మార్చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a comment