Categories
ప్రపంచ దేశాలల్లో రక్త హీనత భారిన పడుతున్న మహిళల శాతం దక్షిణాసియా దేశాలైన భారత్ ,పాక్ లోనే ఎక్కువని అధ్యయనాలు చెపుతున్నాయి. పోషకపదార్థాల లోపం ,నెలసరిలో అధిక రక్త స్రావం. కొన్ని శస్త్ర చికిత్సల వల్ల కూడా రక్త హీనత రావచ్చు. కౌమార దశలో ఇనుము పోషకం ఎక్కువ అవసరం అవుతుంది. చికెన్ ,లివర్,గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వేయించిన శనగ పప్పు ,ఉలవలు,బొబ్బర్లు,పెసలు ,ఎర్ర పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. గోరుచిక్కుడులో ఐరన్ తో పాటు ఫాలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు ,గోంగూర ,పూదినా, మెంతికూర ,మునగాకు ,తోటకూర వంటివి కూడా ఐరన్ ఇచ్చే కూరలే.రోజు చెంచా నువ్వులు ,బెల్లం ,పల్లీలు తినాలి. ఎండు ద్రాక్ష ,నల్ల ద్రాక్ష ,ఖర్జూరం మంచివి.