శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరం అవుతాయి. అందరికీ ఒకే సూత్రం వర్తించదు. నాకయితే నేను తీసుకునే  క్యాలరీల పైన అవగాహన వుంది. ప్లేట్ లో  ఉన్న ఆహారాన్ని చూసి ఎన్ని క్యాలరీలు వున్నాయో  చెప్పగలను. నా శరీరానికి కావలిసిన క్యాలరీలే  తీసుకొంటాను . ఒక్కటి అర్ధం చేసుకోవాలి అమ్మాయిలు. న వృత్తి సినిమా. నేను ధ్రువ సినిమా కోసం ఒక పాటలో కనీసం నీళ్లైనా తాగలేదు. నీళ్లు తాగినా పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. ఆ సినిమాలో నా పొట్ట ఎంత లోతుకు పోయిందో చూసే వుంటారు . కానీ నీరసం  రాకూండా బాకు సప్ప్లమెంట్స్ ఇచ్చే నిపుణులుంటారు. డైట్ చార్ట్ ప్రకారం తినే భోజనం ఉంటుంది. ఇది నా ఇంటర్వ్యూ లో లేదా నేను మాట్లాడితే విని ఫాలో అయితే ఎంత ప్రమాదం. అసలు ఎవరికైనా గుక్కెడు నీళ్లు తాగకుండా పొట్ట లోతుగా వుంచుకోవాలిసిన అవసరం కావలిసి వస్తుందా? తెర పైన నాజూకుగా అందంగా కనిపించటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం . ఈ కాస్ట్యూమ్ లో నైనా ఒదిగిపోయేలా శరీరాకృతి తీర్చి దిద్దుకుంటాం. ఇవి మా వృత్తికి సరిపోతాయి అంటోంది రకుల్. మరి సినిమా స్టార్స్ అడుగు జాడల్లో వుండే అమ్మాయిలేమంటారో ?

Leave a comment