నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ విటమిన్ ఇ అధికంగా వుండే నట్స్ హాల్ గ్రేయిన్స్ టొమాటోలు యాపిల్స్ ఎక్కువగా తినాలి. ఆహారంలో జంక్ లోపం లేకుండా నువ్వులు గుమ్మడి బీన్స్ శెనగలు బాదం బఠాణీలు తినాలి. బీకాంప్లెక్ విటమిన్స్ గల సప్లిమెంట్ డైట్ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. వ్యాయామాలు తప్పకుండా చేసి చక్కగా నిద్రపోవాలి. తీపి పదర్ధాలు ప్రాసెస్డ్ పదర్ధాలు తగ్గించాలి. సూర్య రశ్మి తగిలేలా ఆరుబయట వాకింగ్ చేస్తే మంచిది.
Categories