మనస్సు విసుగ్గా వున్నా అలసిపోయినట్లున్నా పచ్చదనం, పువ్వులు, పచ్చిక వుండే ప్రాంతానికి వెళితే చాలు సేద తీరినట్లే. ప్రకృతిలోకి తొంగి చూడటం చాలా అవసరమైన సందర్భం ఇదే. పచ్చని చెట్లు మనస్సులో అలజడిని తగ్గిస్తాయి. ఎటువంటి మూడ్ లో వున్నా సరే ప్రేశాంతను ఇవ్వగలిగే శక్తి ఆకుపచ్చ రంగుకే వుంది. ఆ రంగును చూడగానే మెదడు శుభాన్ని వుహిస్తుంది. ఆకు పచ్చ రంగంటే ప్రశాంతత అభివృద్ధి ఎదుగుదల. కొత్త ఉత్సాహం అందించి చెక్కని ఆలోచన వైపు మనస్సుని మరల్చే శక్తి మొక్కలకు ఉంది గనుకనే మనం ప్రక్రుతి లోకి వేల్లాలనుకుంటాం. లాన్ పైన చెప్పులు లేని కళ్ళతో నడుస్తుంటే అదొక కొత్త ఉత్సాహం. అందుకే పని చేసే చోట ఓ మూలగా పచ్చని ఆకులున్న కుండీని పెట్టాలి. కిటికీలో నుంచి పచ్చదనం కనిపించిందిఅదో శాంతి. అందుకే హాస్పిటల్ల్లో ఆపరేషన్ రూమ్స్ లో ఎక్కువ పచ్చదనం తో వుండే రంగులు వుండే కర్టెన్ లు, రోగుల మంచం పైన కూడా ఆకుపచ్చని దుప్పట్లే వుంటాయి. ఆఫీస్ గది గోడలకు లేత రంగు వుంటే ఉత్సాహంగా పని చేయగలుగుతాము.

Leave a comment