అసలు ఐటమ్ సాంగ్ అన్న పదం నాకు నచ్చదు అంటుంది ఎన్నో ఐటమ్ సాంగ్స్ చేసిన కత్రినా కైఫ్. పాటల్లో పదాలకు తగ్గట్లు భావాన్ని వ్యక్తం చేస్తూ డ్యాన్స్ చేయడం నాకు తెలుసు ఇంకా వేరే విషయాలు నా బుర్రలోకి రావు.శ్రీదేవి,మాధూరీ దీక్షిత్ ,మడోన్నా నాకు స్ఫూర్తి. బియాన్స్ షో చేసిందంటే ఆ పాటలో ప్రతి పదం ఆమె డాన్స్ లో కనబడుతోంది. పాటలో సారాన్ని డాన్స్ లో చూపించటం గొప్ప విషయం అంటోంది కత్రినా. ఇలాంటి ప్రత్యేక గీతాలు నిజంగా కొరయోగ్రాఫర్స్ మితిమీరి శృంగార వంతంగా రూపోందించినా ,ఆ పాట నాకు సౌకర్యంగా అనిపించకపోతే అస్సలు చేయను కూడా. ఇప్పటి వరకు నను చేసిన డాన్సలన్నీ నేను ఇష్టంగా చేసినవే అంటోంది కత్రానా కైఫ్..