నెలసరి నలత వేధిస్తూ ఉంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోమన్నారు ప్రఖ్యాత న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.ఈ ప్రీ మెన్స్ట్రువల్  సిండ్రోమ్ లక్షణాలు తప్పకుండా పోతయి అంటున్నారు. రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన ఎండు ద్రాక్ష కుంకుమ్  పువ్వు లను పర గడుపున తీసుకోవాలి.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల ఆహారం తో పాటు నెయ్యి తీసుకోవాలి. నెలసరి సమయంలో విసిగించే మలబద్ధకం పోవాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుశనగ పప్పు లను బెల్లంతో  తినాలి.రాత్రి భోజనం గా సగ్గుబియ్యం కిచిడి లేదా రాగి దోసెలు తినాలి పెరుగు, అలసందలు, మినుములు, పెరుగు భోజనంలో భాగంగా ఉండాలి .

Leave a comment