Categories
![మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను నాలుగు గోడలకే పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు పిలిచి వాళ్ళతో వాళ్ళ తల్లి తండ్రులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలి. పిల్లలతో వాళ్ళ స్నేహితులు ముచ్చట్లు తెలుసుకోవాలి. వాళ్ళ స్నేహితుల కోసం స్నాక్స్ చేసి ఇవ్వాలి. పిల్లల స్నేహితులతో ఆస్తులు అంతస్థుల గురించి అడగద్దు. సామాజికంగా అధికంగా వాళ్ళ కుటుంబం ఏ స్థితి లో ఉన్న వాళ్ళు మన పిలల్లకు స్నేహితులని ఎప్పుడూ మరచిపోవద్దు. అలాగే మన పిలల్ల మనసులో కూడా స్నేహాల మధ్య బాంధవ్యం మాత్రమే నిలిచివుండాలి కాని వాళ్ళ స్థితిగతులు కాదు. ఆ వైపుగా పిలల్లకు చక్కగా అర్ధమయేలా వివరించాలి. నీ స్నేహితుడు నాకు విలువైన వాడుగానీ అతని కుటుంబ విషయాలు కానేకాదని పిలల్లతో గట్టిగ చెప్పాలి.](https://vanithavani.com/wp-content/uploads/2017/01/children.jpg)
పిల్లల పెంపకంలో కౌమార దశ చాలా కీలకం . ఇటు పిల్లలు కాక అటు టీనేజ్ కాక మధ్యలో ఉండే ఈ దశ బాల్యం నుంచి పెద్దవాళ్ళు అయ్యే దశ . ఆ సమయంలో పిల్లలు విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటారు . తాము చాలా పెద్దవాళ్ళం అనుకుంటారు . ఆ దశలో వాళ్ళ మనసులో ఎంతో గందరగోళంగా ఉంటుంది . అస్తమానం బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . ముఖ్యంగా ఆడపిల్లలే ఇలా తోచకుండా ఉంది అంటూ ఉంటారంటారు నిపుణులు . అలా అన్నారంటే వాళ్ళు తమ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటం లేదని గుర్తించాలి . వాళ్ళని చదువులో ,ఆటల్లో పూర్తిగా నిమగ్నం అయ్యేలా చూడాలి అంటున్నారు . వాళ్లకు తగిన సమయం కేటాయించి పెద్దవాళ్ళు పిల్లలతో గడపాలనీ ,వాళ్ళ మనసుని తెలుసుకొని సందేహాలు తీర్చాలని చెపుతున్నారు .