పిల్లల పెంపకంలో కౌమార దశ చాలా కీలకం . ఇటు పిల్లలు కాక అటు టీనేజ్ కాక మధ్యలో ఉండే ఈ దశ బాల్యం నుంచి పెద్దవాళ్ళు అయ్యే దశ . ఆ సమయంలో పిల్లలు విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటారు . తాము చాలా పెద్దవాళ్ళం అనుకుంటారు . ఆ దశలో వాళ్ళ మనసులో ఎంతో గందరగోళంగా ఉంటుంది . అస్తమానం బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . ముఖ్యంగా ఆడపిల్లలే ఇలా తోచకుండా ఉంది అంటూ ఉంటారంటారు నిపుణులు . అలా అన్నారంటే వాళ్ళు తమ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటం లేదని గుర్తించాలి . వాళ్ళని చదువులో ,ఆటల్లో పూర్తిగా నిమగ్నం అయ్యేలా చూడాలి అంటున్నారు . వాళ్లకు తగిన సమయం కేటాయించి పెద్దవాళ్ళు పిల్లలతో గడపాలనీ ,వాళ్ళ మనసుని తెలుసుకొని సందేహాలు తీర్చాలని చెపుతున్నారు .

Leave a comment