ఏటి కొప్పాక చెక్క బొమ్మలకు రెండు వందల సంవత్సరాల చరిత్ర వుంది. నక్క పల్లి అడవుల నుంచి తెచ్చి ఒక ప్రత్యేకమైన చెక్కతో ఈ బొమ్మలు చేస్తారు. ఇవి విశాఖా జిల్లాకు చెందినవి. లెత్ మిషాన్ పైన ఎక్కువ శాతం గుండ్రని రూపాల్లో వుండే ఈ బొమ తయ్యారీలో ఎంతో మంది కళాకారుల సమిష్టి కృషి వుంది. కొన్ని రకాల చెట్ల బెరడులు కొన్ని మొక్కల విత్తనాల నుంచి తీసిన రంగులు ఈ బొమ్మలకు వాడతారు. ఆట బొమ్మలే కాదు ఇంటి ఉపయోగానికి ఈ బొమ్మలు  ప్రసిద్ధి. ఇందులో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన బొమ్మలున్నాయి. చక్రాలతో కదిలే బొమ్మలున్నాయి. రంగుల రత్నం ప్రత్యేకం. చక్కని ఫినిషింగ్ తో చూడగానే కళ్ళకు ఆకర్షిస్తాయి ఈ ఏటి  కొప్పాక  ఆట బొమ్మలు.

Leave a comment