అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక నిపుణులు. ఇలా చేస్తేనే సరైన సమయంలో జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది అంటారు. కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవడంలో శరీరంలోని గ్లూకోజ్ స్దిరంగా వుంటుంది. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. ఇది కూడా అపూహానే. అన్ని రకాల బ్రేడ్స్ లోను కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. రెండు రకాలు రిఫైన్డ పిండి తో చేసినవే. అలాగే తక్కువ ఫ్యాట్ అంటే మంచిది అనుకొంటారు. శరీరంలోని 80 శాతం హార్మోన్స్ ఫ్యాటీ కొలెస్ట్రోల్ తో రూపొందించినదే. తక్కువ పోషకాల వల్ల బయో కెమిస్ట్రి దెబ్బతింటుంది. క్యాలరీలు ఏమాత్రం తగ్గకూడదు. తక్కువ క్యాలరీలు వున్న ఫుడ్ వున్న ఫుడ్ తీసుకుంటే శరీరానికి పోషకాలు అందవు. అంచేత పోషకాలు సమం గా వుండే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.

Leave a comment