సీజన్ తో పని లేకుండా సన్ గ్లాస్ లు వాడటం మంచిదే అంటారు .రోజు మొత్తం ఎన్నో పనుల కోసం ,కళ్ళు నిరంతరంగా చలిస్తూ చూస్తూ అలిసిపోతూ ఉంటాయి. అలాగే నిర్లక్ష్యంగా ఎండలోకి సూర్యకిరణాలు మొహంపై పడేలా వెలుతూ ఉంటే కళ్ళకు ఎంతో నష్టం కలుగుతుంది.సన్ గ్లాస్ లు సూర్యకిరణాల నుంచి మాత్రమే కాదు ,చలిగాలులు హానికరమైన ,వెచ్చని ,చల్లని వాతావరణం నుంచి కళ్ళను కపాడుతాయి. చల్లగా మంచు పడుతున్నట్లు అనిపిస్తే హట్ లేదా హూడెడ్ జాకెట్ ధరించాలి. ఐ డ్రాప్స్ వాడాలి. కళ్ళ కింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. రాత్రి వేళ నొరిషింగ్ ఐస్ క్రిమ్ రాసుకొంటే ముడతలు రాకుండా ఉంటాయి.

Leave a comment