ఒకప్పటి మిస్ ఇండియా, భారతీయ నటి సెలీనా జైట్లీ చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. జీవితంలో తాను చవిచూసిన నిజమైన ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది.అది జీవితం చుట్టూ అల్లుకుంటుంది అంటుంది సెలీనా జైట్లీ. పీటర్ హాగ్ ని పెళ్లాడాక సినిమాలు మానేసి ఇల్లు పిల్లలే లోకం గా ఉన్నారామె.ఈ మధ్య కాలంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. రెండో కాన్పులో పుట్టిన కవల పిల్లల్లో ఒక బిడ్డ చనిపోయాడు. తన కష్టంలో అండగా ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గా పని చేస్తే భర్త ఉద్యోగం కూడా మానేసి ఆమెకు అండగా నిలబడ్డాడు. ఇంటర్వ్యూ లో ఆమె ఇదంతా చెప్పి పెళ్లికి ముందు ప్రేమించుకున్నదంతా ఈ ప్రేమ కంటే ఓ పిసరు కాస్త తక్కువే అన్నది.నిజమే కదా సృష్టి లో కూడా ఎప్పటికీ నశించకుండా వస్తోంది మాత్రమే కదా !