Categories
మహిళా అధికారులు జిల్లాగా నల్బరీ జిల్లా పేరు పొందింది బ్రహ్మపుత్రా నది ఉత్తరపు వడ్డున అస్సాం నగరం గుహవాటి కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్బరీ. ఈ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలే డిప్యూటీ కమిషనర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసోసియేషన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జిల్లా ఎస్పీ జిల్లా లోని ఐదుగురు జడ్జీలు నలుగురు సర్కిల్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ రెవెన్యూ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ లేబర్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఇలా ఆఫీసర్లు అందరూ మహిళలే.