Categories
దీప్తి శర్మ భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.2014 లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ తో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఐసీసీ మహిళా వన్డే కప్ ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ 5 లో నిలిచింది.ఐసిసి టి20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ విమెన్ 2024 జాబితా లో ఎక్కిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో పుట్టిన దీప్తి తొమ్మిది ఏళ్ళ వయసు నుంచే క్రికెట్ పై ఇష్టం పెంచుకుంది.