ది అన్ కట్ టీమ్ కామ్ అనే వెబ్ సైట్ ని తన స్నేహితురాలు తీయగర్గ్ తో కలిసి రూపొందించిన పదిహేడేళ్ల సుహాని దారుకా .ఈ టీమ్ లో మొత్తం 55 మంది విద్యార్థులు ఉన్నారు ఢిల్లీ, ఆగ్రా తో సహా వివిధ స్కూళ్లు కాలేజీలల్లో చదువుతున్న వీరంతా ఏకమై కేవలం 14 గంటల్లో కోవిడ్ రోగులకు అవసరమైన డేటాతో ది అన్ కట్ టీమ్ కామ్ నిరూపొందించారు. ఈ సైట్ లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడిగా ఆక్సిజన్ బెడ్లు ప్లాస్మా రక్తం మందుల లభ్యత వంటి వివరాలు అందుబాటులో ఉంచారు ఉచిత వైద్య సదుపాయం అందించే వైద్యల లిస్ట్ ఉంటుంది. ప్రతి గంటకు ఇందులో వివరాలు అప్ డేట్ అవుతాయి.