కాలం శరవేగంతో మారిపోతుంది. అందుకు అనుగుణంగా కొత్త అవసరాలు పరిష్కారాలు వస్తున్నాయి. ఇది వరకు చేతిలో విజిటింగ్ కార్డ్ ఉండేది. దాని పైన చిరునామా ఫోన్ నెంబర్ ఉండేవి. ఇప్పటిలాగా ఫేస్ బుక్ ట్విట్టర్ వెబ్ సైట్ ల వివరాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ అందరికీ వివరాలు షేర్ చేయడం కష్టమే. అలాగని విజిటింగ్ కార్డ్ పైన ఇన్నేసి వివరాలు ప్రింట్ చేయలేం కూడా. దుబాయ్ కు చెందిన లానర్ బ్యూటీ పార్లర్ ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపెట్టింది. అదే మైక్రో చిప్ మానిక్యూర్. కస్టమర్స్ కోరినట్లు వాళ్ళిచ్చిన సమాచారం లో ఒక చిన్న ఎన్.ఎఫ్.సి చిప్ ని తయారుచేస్తారు. దాన్ని గోరు పై అతికించి పైన గోళ్ళ రంగు వేస్తారు. ఈ గోళ్ళ రంగు ఉన్నంత కాలం చిప్ భద్రంగా అతుక్కొని ఉంటుంది. గోళ్ళ రంగు పోతుంది అనుకొంటే మళ్ళీ దాని పైన రంగు వేసుకోవచ్చు ఎవరికైనా విజిటింగ్ కార్డ్ ఇవ్వవలసి వస్తే వాళ్ల స్మార్ట్ ఫోన్ దగ్గర ఈ గోరు పెడితే చాలు సమాచారం ఫోన్ లోకి వెళ్లి పోతుంది. ఈ మైక్రోచిప్ మ్యానిక్యూర్ సక్సెస్ అయింది కాబట్టి ఇదే తరహాలో క్రెడిట్, డెబిట్ కార్డ్ చిప్ లు తయారు చేసి ఇదే తరహాలో మ్యానిక్యూర్ చేస్తారు. ఇదే రకంగా ఆధార్ పాన్ కార్డుల్ని కూడా చిప్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా !

Leave a comment